
గిరిజన గురుకులాల్లోసమస్యలు పరిష్కరించాలి
● ఏబీవీపీ జిల్లా కన్వీనర్ యోగి డిమాండ్
పాడేరు : పట్టణంలో గిరిజన గురుకుల పాఠశాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ టి.యోగి డిమాండ్ చేశారు. గిరిజన గురుకుల పాఠశాలలో సమస్యలపై శనివారం టీడబ్ల్యూ డీడీ పరిమళను కలిసి వినతి పత్రం అందజేశారు. పాడేరు గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ఒక్కరోజు కూడా మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదన్నారు. ఈ విషయంపై విద్యార్థినులు పాఠశాల ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తే ఆమె వ్యవహార శైలి సక్రమంగా లేదన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రుల పట్ల కూడా ఆమె సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. ఈ విషయంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి ఆమైపె చర్యలు తీసుకోవాలని, మెనూ సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు. లేకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిన్నబ్బాయి, జిల్లా హాస్టల్ ఇన్‌చార్జి కృష్ణమూర్తి, నాయకులు సంజయ్‌కుమార్, వెంకట్, సాగర్, రామ్‌చరణ్, సూర్య పాల్గొన్నారు.