
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి
హుకుంపేట: విద్యార్థుల చదువులపై ఉపాధ్యాయులు ఆశక్తి చూపిస్తు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా విద్యశాఖాధికారి బ్రహ్మాజీరావు అన్నారు. శనివారం మండలంలోని పెదగరువు ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల, మత్స్యపురం ప్రాథమిక పాఠశాలల్లో ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించారు. రికార్డుల తనిఖీ చేశారు. పాఠశాలల పరిసరాలను ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. విద్యతో పాటు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. హెచ్‌ఎంలు సువర్ణరాజ్, బాలాజీ, సత్యారావు తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకు ఆధార్ తప్పనిసరి
డుంబ్రిగుడ: విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డులు కలిగి ఉండాలని జిల్లా విద్యాశాఖధికారి బ్రహ్మాజీరావు అన్నారు. మండల కేంద్రంలోని ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశంలో హాజరైన ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడారు. బడిఈడు పల్లలను బడిలో తప్పక చేర్పించాలన్నారు. ఆధార్ కార్డులతో సమగ్ర నివేదికను అందజేయాలని సూచించారు. ఎఫ్–1 మార్కుల జాబిత పొందుపరచాలన్నారు. ఆదికర్మ యోగి అభియాన్ వివరాలను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వర్తించేలా ప్రణాళిక తయారు చేయాలని ఆయన ఎంఈవోలకు ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారులు శెట్టి సుందర్‌రావు, గంజాయి గెన్ను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఈవో బ్రహ్మాజీరావు

విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి