
వైద్య సేవలపట్ల అలసత్వం వహిస్తే చర్యలు
● డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు
డుంబ్రిగుడ: వైద్యసేవల పట్ల ఆలసత్వ చేస్తే సహించేది లేదని డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు హెచ్చరించారు. శనివారం ఆయన డుంబ్రిగుడ, కిల్లోగుడ పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. వైద్యసేవలు అందుతున్న తీరును రోగుల నుంచి తెలుసుకున్నారు. కిల్లోగుడలో ఆస్పత్రి ప్రాంగణంలో చెత్తను తొలగించారు. అనంతరం డీఐవో కమలకుమారితో కలిసి మొక్కలను నాటారు. వైద్యంతో పాటు గ్రామాలలో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో రెండు పీహెచ్‌సీల వైద్యాధికారులు పి.రాంబాబు, నజీబ్, సిబ్బంది పాల్గొన్నారు.