
గోమంగి మండల సాధన సమితి ఉద్యమ పాటల ీసీడీ విడుదల
పెదబయలు: మండలంలోని గోమంగి మండల సాధన సమితి ఆద్వర్యంలో 27 ఏళ్ల పాటు సాగించిన పోరాటంపై ఉద్యమ గీతానికి సంబంధించి సంబందించి పాట సీడీని మండల సాధన సమితి నాయకుల ఆద్వర్యంలో విడుదల చేశారు. శనివారం ఈ పాటలో గోమంగి కేంద్రంగా 17 గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రకృతి అందాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలను మేళవించి ఉద్యమ పాట విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సాధన సమితి నాయకులు సల్లంగి ఉమామహేశ్వరరావు, జెడ్పీటీసీ బొంజుబాబు, రాధాకృష్ణ, పృధ్వీరాజు, అనంతపద్మనాభం, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, 17 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అఖిల పక్ష నేతలు పాల్గొన్నారు.