
హాట్ బజార్లతో గిరిజన, అటవీ ఉత్పత్తుల విక్రయాలు
మిగతా 8వ పేజీలో
● పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
● ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచన
హుకుంపేట: గ్రామాల్లో హాట్ బజార్ల ద్వారా గిరిజన, అటవీ ఉత్పత్తులు విక్రయించి మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని పాడేరుఉ ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ సూచించారు. గురువారం మండలంలోని సూకురు, తీగలవలసలో ఆమె పర్యటించారు. హాట్ బజార్లను పరిశీలించారు. మౌలిక సదుపాయాల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తీగలవలస అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. సేవల వివరాలను తెలుసుకున్నారు. అంగన్‌వాడీ చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ సిబ్బందిని ఆదేశించారు. అంగన్‌వాడీ భవానం పునర్నిర్మాణానికి అంచనాలు