
ప్రతిభకు ఉపకారం
30వ తేదీ వరకు ఎన్‌ఎంఎంఎస్‌కు దరఖాస్తుల స్వీకరణ
8వ తరగతి చదివేప్రభుత్వ విద్యార్థులు అర్హులు
డిసెంబర్ 7న అర్హత పరీక్ష
ఎంపికై న వారికి ఇంటర్ వరకు ఉపకార వేతనం
ఏటా రూ.12 వేలు అందించనున్న కేంద్ర ప్రభుత్వం
అనకాపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామీణ, పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే అధికంగా చదువుకుంటారు. వీరిలో చాలామంది ఆర్థిక కారణాలతో మధ్యలో బడి మానేసి విద్యకు దూరమవుతున్నారు. దీంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువులు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనం అందిస్తూ చేయూతనిస్తోంది. ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్స్(ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ ఏటా రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తోంది. దరఖాస్తుకు ఈ నెల 30వ తేదీ వరకూ గడువు ఉంది. డిసెంబర్ 7వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.