
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
హుకుంపేట: పౌష్టికాహారంతో తల్లి, బిడ్డలకు మంచి ఆరోగ్యం లభిస్తుందని అరుకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం చెప్పారు. మండలంలోని కులుపాడులో జరిగిన పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గర్బిణిలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహారంతో తల్లి, బిడ్డ ఆరోగ్యంతో ఉంటారని పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. సీడీపీవో బాలచంద్రమణిదేవి, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొయ్యూరు: మండలంలోని బంగారంపేట అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని గురవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీవో దేవమణి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రోజూవారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. సూపర్‌వైజర్లు కనకమహాలక్ష్మి, విజయలక్ష్మి, రామలక్ష్మి, సత్యవతి, బాలామణి పాల్గొన్నారు
ఎటపాక: మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో అరుణ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. సర్పంచ్ వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ మంగేశ్వరరావు, తహసీల్దార్ కారం సుబ్బారావు, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, ఎంఈవో రాజులు, ఏపీఎం భాస్కర్, సూపర్‌వైజర్ రాధమ్మ, శ్రీనివాస్, గంగాధర్, చలపతి తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం