
హాట్ బజార్లతో గిరిజన, అటవీ ఉత్పత్తుల విక్రయాలు
7వ పేజీ తరువాయి
రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తీగలవలస పంచాయతీలో కిన్నీర్లోవా రోడ్డు, హుకుంపేట–కామయ్యపేట రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ బేసు, పీసా కమిటీ సభ్యులకు ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ధ్రువకుమార్, సర్పంచ్ ధనసాని సత్యవతి పాల్గొన్నారు.
ఆది కర్మయోగి సేవా కేంద్రం ప్రారంభం
పాడేరు : స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా ఆది కర్మయోగి సేవా కేంద్రాన్ని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సమాజానికి శక్తివంతమైన వికేంద్రీకృత నాయకత్వ పాలన వ్యవస్థ నిర్మించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సమన్వయం చేయడం కోసం ఆది కర్మయోగి కార్యక్రమం పని చేస్తుందన్నారు. గ్రామ స్థాయి అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలు తయారు చేస్తారన్నారు. తద్వారా వివిధ విభాగాల సమన్వయంతో ప్రణాళిక అమలు పరచి గిరిజన గిరిజన గ్రామాల సర్వతోముఖాభివృద్ధి సాధించడం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి తద్వారా గ్రామస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పాడుతుందన్నారు. మండల, గ్రామ సచివాలయ స్థాయిలో సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు జిల్లా నోడల్‌గా కె. రాజేష్‌బాబును నియమించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో వెంకటేశ్వరరావు, పీఎంయూ అధికారి వేణుగోపాల్, సిబ్బంది, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.