
అధ్వాన రహదారితో అవస్థలు
● మరమ్మతు చేసిన మూన్నాళ్లకే
కోతకు గురైన రోడ్డు
● పెరుగుతున్న ప్రమాదాలు
● పట్టించుకోని అధికారులు
అరకులోయటౌన్: మండలంలోని అరకు–విశాఖ ప్రధాన రహదారులు మరమ్మతు చేసిన కొద్ది రోజులకే శిథిలావస్థకు చేరాయి. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పానిరంగిని రైలు బ్రిడ్జి సమీపంలోని రహదారి ప్రధాన పూర్తిగా ధ్వంసమైంది. అరకు సంత బయలు నుంచి యండపల్లివలస గ్రామాల మధ్యలోని వంతెన వద్ద రహదారి శిథిలదశకు చేరడంతో పాటు వంతెన కోతకు గురైంది. పెద్ద పెద్ద గోతులుండడంతో వాహనచోదకులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత మరమ్మతులు చేసిన రహదారులు శిథిలవస్థకు చేరడంపై ప్రజలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా రు. అధ్వాన రహదారుల్లో వాహనచోదకులు ఆద మరచి ప్రయాణిస్తే ప్రమాదం తప్పదని స్థానికులు ఆదోళన చెందుతున్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి పాడైన రహదారులకు నాణ్యతతో మరమ్మతు చేయాలని స్థానికులు, వాహాన చోదకులు కోరుతున్నారు.