
కార్మిక చట్టాలు పక్కాగా అమలుచేయాలి
ముంచంగిపుట్టు: కార్మిక,కర్షక స్కీమ్ వర్కర్ల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి ఐక్య పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమ మహేశ్వరరావు అన్నారు.మండల కేంద్రంలో గురువారం సీఐటీయూ మహాసభను నిర్వహించారు.ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికల హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు.రోజుకొక చట్టాన్ని తీసుకువచ్చి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. కార్మిక చట్టాలను పక్కాగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. అరకులోయలో అక్టోబర్ 6,7 తేదీల్లో నిర్వహించనున్న మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.అనంతరం మండల సీఐటీయూ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నాయకులు సుందర్‌రావు, శంకర్‌రావు, లక్ష్మీపురం సర్పంచ్ త్రినాఽథ్ తదితరులు పాల్గొన్నారు.