
రోడ్డు ప్రమాదంలో గిరిజనుడి మృతి
చింతపల్లి: లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ గిరిజనుడు మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి మృతుడి బంధువులు అందించిన వివరాలిలా ఉన్నాయి. లంబసింగి గ్రామానికి చెందిన వాడకాని రాజశేఖర్(54) గురువారం నర్సీపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా ఘాట్‌రోడ్డులో బోడకొండమ్మ ఆలయం దిగువున ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రాజశేఖర్‌ను అంబులెన్సులో నర్సీపట్నం తరిలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడు పంచాయతీ వార్డు సభ్యుడిగా ఉన్నారు.దీంతోపాటు లంబసింగిలో శివాలయంలోని అర్చకుడిగా సేవలందిస్తున్నారు. రాజ్‌కుమార్ మృతితో లంబసింగిలో విషాదచాయలు అలముకున్నాయి.