
కొనసాగుతున్న నిరసనలు
సీలేరు: విద్యుత్ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు సెంట్రల్ జేఏసీ పిలుపుతో సీలేరులో బుధవారం స్థానిక జెన్ కో డివిజనల్ కార్యాలయం ఎదుట భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నాయకుడు వై సత్తిబాబు మాట్లాడుతూ దీర్ఘకాల సమస్యల సాధనకై దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తమ సెంట్రల్ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు.అలాగే 19, 20 తేదీల్లో అన్ని సర్కిల్ ఆఫీసుల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు.అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణ నిర్ణయించబడుతుంది.జేఏసీ చైర్మన్ వై సత్తిబాబు తెలిపారు. నాయకులు భవాని శంకర్, నాగేశ్వరరావు, రామకృష్ణ, పాండు తదితరులు పాల్గొన్నారు.