
గిరిజన విద్యార్థికి అభినందనలు
చింతపల్లి: చింతపల్లి గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థి బొబ్బిలి ప్రవీణ్ రాయ్‌పూర్ ఎన్‌ఐటీలో సీటు సాధించినట్టు ప్రిన్సిపాల్ కె.వి.రామేశ్వరం తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో తాజంగి పంచాయతీ పరిధిలోని బొబ్బిలి ప్రవీణ్ కళాశాలలో 2023–25 విద్యా సంవత్సరంలో ఎంపీసీలో గ్రూప్‌లో పూర్తి చేశాడన్నారు. విద్యార్థి తల్లిదండ్రులు బొబ్బిలి చంటిబాబు, సింహాచలం వ్యవసాయ కూలీలని, విద్యార్ది కేవలం కళాశాలలో అధ్యాపకులు ఇచ్చిన కోచింగ్ తీసుకుని జేఈఈ మెయిన్స్‌లో రాణించాడన్నారు. ప్రవీణ్ రాయపూర్ ఎన్‌ఐటీలో సీటు సాధించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కు పలువురు అభినందనలు తెలిపారు.