
వెదురు కంజి.. ఎంతో ప్రీతి
7వ పేజీ తరువాయి
బొంగు నుంచి లేత వెదురును తీసి వాటి నుంచి చిగురును సేకరిస్తున్నారు. శుభ్రం చేసి ముక్కలు చేసి వాటా రూ. 20 నుంచి రూ.40కు అమ్ముతున్నారు.
రెండు రకాలుగా కర్రీ..
వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారీకి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఒక రకంగా, ఎండబెట్టి మరో విధంగా కూర తయారు చేస్తారు. పచ్చిగా ఉన్నప్పుడు వెంటనే కూర తయారు చేసుకోవాలి. ఎండబెట్టుకొని ఉంటే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర తయారీకి వినియోగించవచ్చని గిరిజనులు తెలిపారు. వెదురు కంజిని వేపుడు, పచ్చడి, పులుసు ఇలా రకరకాలుగా తయారు చేసుకుని తింటామని వారు పేర్కొన్నారు. కూర తయారీకి ముందు రెండు మూడు సార్లు బాగా కడుగుకోవాలి..అప్పుడే వెదురు కంజిలో ఉండే చేదు పోతుందని గిరిజనులు తెలిపారు.
ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
వెదురుకంజిని బాగా ఉడకబెట్టి దాని కషాయాన్ని తాగితే వేడి చేస్తుంది. మధుమేహం, కపం, మూలవ్యాధి నివారణకు దోహదపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా గర్భకోశ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని గిరిజనులు చెబుతున్నారు. వెదురు కంజిని పేస్ట్‌గా తయారు చేసి గాయంపై రాయడం వల్ల త్వరగా మాను పడుతుందని వారు వివరించారు. అంతేకాకుండా పాము, తేలు కాటులకు ఔషధంగా ఉపయోగిస్తామని వారు వివరించారు.

వెదురు కంజి.. ఎంతో ప్రీతి