
టెన్త్ విద్యార్థుల సామర్థ్యం పెంపునకు కృషి
చింతపల్లి: టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణత సాధనకు విద్యార్థుల సామర్థ్యం మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశించారు. బుధవారం స్థానిక ఆదర్శ పాఠశాలతో పాటు జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి టెన్త్ వరకు నిర్వహించిన బేస్‌లైన్ పరీక్షల్లో విద్యార్థుల ప్రమణాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనిపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. ఉపాధ్యాయుల బోధన నైపుణ్యం పెంచేందుకు వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రస్తుతం పాడేరు, శ్రీ కృష్ణాపురం,రంపచోడవరం పాఠశాల్లో డీఆర్పీలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. వీరు మండలాల వారీగా రెండు దశల్లో అవసరమైన శిక్షణ ఇస్తారన్నారు. పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు.
400 టీచర్ పోస్టుల భర్తీ
ప్రస్తుత నియామకాల్లో జిల్లాలో 400 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయని డీఈవో తెలిపారు.ఈ నియామకాలతో పూర్తిగా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులతోపటు సబ్జెక్ట్ టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుందన్నారు. ఎంఈవోలు ప్రసాద్, బోడం నాయుడు పాల్గొన్నారు.
పాఠశాలల తనిఖీ
రాజవొమ్మంగి: స్థానిక మోడల్ ప్రైమరీ స్కూల్, సూరంపాలెంలో ప్రాథమిక పాఠశాలను డీఈవో బ్రహ్మాజీరావు బుధవారం తనిఖీ చేశారు. ఉదయం అసెంబ్లీ సమయానికి పాఠశాలలకు చేరుకున్న ఆయన పిల్లల హాజరు, వారి క్రమశిక్షణ పరిశీలించారు. విద్యాబోధన తీరును తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఎంఈవోలు సత్యన్నారాయణదొర, సూరయ్యరెడ్డి పాల్గొన్నారు.
డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశం

టెన్త్ విద్యార్థుల సామర్థ్యం పెంపునకు కృషి