
64 పీహెచ్‌సీల్లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్
పాడేరు రూరల్: స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌తో ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుందని డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గుడివాడ అంగన్‌వాడీ కేంద్రంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు మహిళలకు ఎంతో మేలు చేకూరుస్తాయన్నారు. జిల్లావ్యాప్తంగా 64 పీహెచ్‌సీల పరిధిలో ఈనెల 17 నుంచి వచ్చేనెల 2 వరకు పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లా పోగ్రాం అధికారి కమలాకర్ బట్టు, ఆరోగ్య విస్తరణాధికారి సింహాద్రి, జిల్లా కోఆర్డినేటర్ ప్రసన్నదత్త, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించండి
హుకుంపేట: గ్రామాల్లో మహిళలు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన స్థానిక పీహెచ్‌సీతోపాటు శోభకోట సబ్‌సెంటర్‌లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి సౌజన్య, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ బి.కమలాకర్ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు