
వైభవంగా విశ్వకర్మ జయంతి
సాక్షి,పాడేరు: విశ్వకర్మ జయంతిని జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం ఘనంగా నిర్వహించారు.కలెక్టరేట్‌లో విరాట్ విశ్వకర్మ చిత్రపటం వద్ద జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలివాస్తు శిల్పి, సృష్టికర్తగా విరాట్ విశ్వకర్మ కీర్తి పొందారన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత, బీసీ సంక్షేమశాఖ అధికారి ఆర్.కృష్ణారావు, విశ్వబ్రహ్మణ సంఘ పట్టణ అధ్యక్షుడు కొమ్మోజు వెంకటరమణ, ప్రతినిధులు ఎల్.నాగభూషణం, వేమూరి సత్తిబాబు, నవర గోవిందరావు, లతాకుమారి, కేజియారాణి,పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.అలాగే సబ్‌కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారి అప్పలస్వామి, ఇతర అధికారులు సిబ్బంది అంతా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. సుండ్రుపుట్టులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని విరాట్ విశ్వకర్మ విగ్రహనికి విశ్వబ్రహ్మణ కుటుంబాలు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. పాడేరు పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన ఏర్పాటుచేశారు.