
విద్యార్థులు క్రీడల్లోనూరాణించాలి
సీలేరు: ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఏపీ జెన్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేంద్రప్రసాద్ సూచించారు. ఇంజనీర్స్ డే సందర్భంగా మంగళవారం సీలేరులో పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీలు జైపాల్, శ్రీధర్ కుమార్. ఏఎస్సార్ శ్రీనివాస్.ఏఈఈ సురేష్ పాల్గొన్నారు.