
ప్రభుత్వ తీరు దారుణం
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి నుంచీ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది. తాజాగా పత్రికా స్వేచ్ఛను కూడా ప్రభుత్వం హరిస్తోంది. జర్నలిస్టులపై, సాక్షిపై వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. విలేకరుల సమావేశంలో నాయకుల మాటలను వార్తలుగా ప్రచురిస్తే పత్రికలపై కేసులు పెట్టడం చరిత్రలో తొలిసారి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే బాధ్యత మీడియాపై ఉంది. రాష్ట్రంలోని ప్రజలు ప్రతీ అంశాన్ని గమనిస్తున్నారు. కచ్చితంగా కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు.
– అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే