
గాయపడిన యువకుడి మృతి
మిగతా 8వ పేజీలో
● అనకాపల్లి నుంచి పాడేరు
జిల్లా ఆస్పత్రికి మృతదేహం
● బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
పాడేరు : మండలంలోని చింతలవీధి శివారు హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు థామస్ ప్రవీణ్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతనిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించిన కొద్ది సేపటికే మృతి చెందాడు. దీంతో ఆదే అంబులెన్స్‌లో మృతదేహాన్ని పాడేరు జిల్లా ఆస్పత్రి మార్చురీకి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం ఉదయం హుకుంపేట మండలం దాలిగుమ్మడి నుంచి అధిక సంఖ్యలో జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు జిల్లా ఆస్పత్రిలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుని కుటుంబసభ్యుల ఆందోళన
జేసీబీ వాహనం ఢీ కొట్టడంతో థామస్ ప్రవీణ్ మృతి చెందాడని, తమకు తక్షణమే న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి బయట సుమారు మూడు గంటల పాటు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ ధీనబంధు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం జేసీబీ యూనియన్