
గవర్నర్‌ను కలిసిన అరకు ఎంపీ తనూజరాణి
● వైద్య కళాశాలలు ప్రభుత్వ నిర్వహణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని వినతి
సాక్షి,పాడేరు: రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి తిరుపతిలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.గిరిజన ప్రాంతాల్లో ప్రధాన సమస్యలు,గిరిజన చట్టాల పరిరక్షణ ఆంశాలను గవర్నర్‌కు వివరించినట్టు ఆమె పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం బాధాకరమని, దీనిపై పునఃపరిశీలించి ప్రభుత్వ నిర్వహణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించినట్టు చెప్పారు. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో స్థానిక గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, జీవో నంబరు 3కు ప్రత్యామ్నాయంగా జీవో తెచ్చి గిరిజన ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరామన్నారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలుకు కృషి చేయాలని, అరకులోయ ప్రాంతాన్ని సందర్శించాలని గవర్నర్‌ను కోరినట్టు ఎంపీ తెలిపారు.