
పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
● ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడుకు వినతి
చింతపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు పరిచేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (పీసీఎస్)సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుములు వెంకటరమణ, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు యువిగిరి కోరారు. మంగళవారం చింతపల్లిలో ప్రవేటు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా పలువురు సంఘనేతలు ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువె ళ్లారు. ముఖ్యంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు జీవన్మరణ సమస్యగా మారిన సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిలర్ మత్సలింగం, జిల్లా కార్యదర్శి ఆర్‌వీ రమణమ్మ, కార్యదర్శి సత్తిబాబు, సీనియర్ నాయకులు వసపరి శామ్యూల్, గిరిజన సంక్షేమ ఉద్యోగుల సంఘం నాయకులు రామరాజుపడాల్, ప్రసాద్, పీఆర్‌టీయూ మండల ప్రతినిధులు చలపతి, నగేష్‌కుమార్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.