
సకాలంలో విధులకు హాజరు
● రంపచోడవరం ఐటీడీఏ పీవో
స్మరణ్‌రాజ్ ఆదేశం
● గంగవరంలో పర్యటన
గంగవరం : ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగ సిబ్బంది ప్రతిరోజు సకాలంలో విధులకు హాజరు కావాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్ ఆదేశించారు. మంగళవారం ఆయన గంగవరంలో పర్యటించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులకు పలు సూచనలు చేశారు. సిబ్బంది. సేవల వివరాలను తహసీల్దార్ శ్రీనివాసరావు నుంచి తెలుసుకున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బర్త్ వెయిటింగ్ హాల్ పరిశీలించారు. ఇక్కడ సేవల వివరాలను తెలుసుకున్నారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన పీవో బాలబాలికలు ఆటలపై దృష్టి పెట్టేలా ఆటపాటలతో బోధించాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలను సందర్శంచారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎంపీడీవో వై.లక్ష్మణరావు, ఎంఆర్‌ఐ లక్ష్మణరావు, ఎంఈవో–2 మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.