
హైస్కూళ్లలో డీఈవో ఆకస్మిక తనిఖీ
అడ్డతీగల: అడ్డతీగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈవో పి.బ్రహ్మాజీరావు ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఆన్‌లైన్ అటెండెన్స్ నూరు శాతం నమోదు చేయాలిని ఆదేశించారు. విద్యార్థుల నోటు పుస్తకాలను తనిఖీ చేసి సిలబస్ నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని డీఈవో సూచించారు. పాఠశాల రికార్డులతో పాటు టైంటేబుల్, అకడమిక్ క్యాలెండర్, ఉపాధ్యాయుల హ్యాండ్‌బుక్స్ తదితర వాటిని క్షుణ్ణంగా చూశారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలన్నారు. ఎంఈవో పి.శ్రీనివాసరావు, హెచ్‌ఎం బి.వెంకటలక్ష్మి ఇతర ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి: డీఈవో బ్రహ్మాజీరావు రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. హాజరు, తదితర రికార్డులు పరిశీలించారు. ఇదే ప్రాంగణంలో కొనసాగుఉతన్న వుమన్స్ జూనియర్ కాలేజీని సందర్శించి, వివరాలు సేకరించారు.