
ఆటోను ఢీకొట్టిన లారీ
ఎటపాక: ఆటోను వెనుక నుంచి గుర్తుతెలియని లారీ డీకొట్టిన ఘటన మంగళవారం సాయంత్రం బండిరేవు సమీపంలో చోటుచేసుకుంది. గౌరిదేవిపేట గ్రామానికి చెందిన కొందరు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం చింతూరు ఏరియా వైద్యశాలకు వెళ్లారు. ఈక్రమంలో తిరిగి గ్రామానికి వస్తుండగా బండిరేవు వద్ద జాతీయరహదారిపై చింతూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఓలారీ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పల్టీకొట్టుకుంటూ రహదారి పక్కన ఉన్న ఇంటిపై పడింది. ఆ సమయంలో ఆటోలో డ్రైవర్ దారోగ రామారావు,మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.