ఆదర్శనీయుడు మోక్షగుండం | - | Sakshi
Sakshi News home page

ఆదర్శనీయుడు మోక్షగుండం

Sep 16 2025 7:33 AM | Updated on Sep 16 2025 7:33 AM

ఆదర్శ

ఆదర్శనీయుడు మోక్షగుండం

మోతుగూడెం: లోయర్‌ సీలేరు జలవిద్యుత్‌ ప్రాజెక్టులో ఇంజినీర్స్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రం వద్ద మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి చీఫ్‌ ఇంజినీర్‌ చిన కామేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఈ బాలకృష్ణ, వరప్రసాద్‌, ఇంజినీరింగ్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జ్ఞానేశ్వరరావు ఇతర ఇంజినీర్లు పాల్గొన్నారు.

ఇంజనీర్స్‌ డే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్‌ రెడ్డి, ఇతర ఇంజినీర్లు

సీలేరు: దార్శనికుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్లందరికీ ఆదర్శనీయుడని ఏపీ జెన్‌ కో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని సోమవారం సీలేరు గెస్ట్‌ హౌస్‌లో ఇంజినీర్స్‌ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండం సాగు,తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈఈ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి చేసి, వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామంటే దానికి మోక్షగుండం కారణమని చెప్పారు. ఏడీలు వై.శ్రీధర్‌ కుమార్‌, ఏ.ఎస్‌.ఆర్‌.జైపాల్‌, అప్పారావు శ్రీనివాసు, ఏఈఈ సురేష్‌, నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను సత్కరించారు.

ఆదర్శనీయుడు మోక్షగుండం1
1/1

ఆదర్శనీయుడు మోక్షగుండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement