
డిప్యూటేషన్ల రద్దుకు వినతి
డీడీకు వినతిపత్రం ఇస్త్తున్న యూటీఎఫ్ నాయకులు
రంపచోడవరం: రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో పరిధిలో ఆశ్రమ పాఠశాలు, ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఏడాది మేలో జరిగిన బదిలీల్లో నూతన పాఠశాలల్లో చేరిన ఉపాధ్యాయులను వెంటనే సర్దుబాటు పేరుతో స్థానచలనం చేయడాన్ని ఏపీ యూటీఎఫ్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్యను కలిసి పలు డిమాండ్లుతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. డిప్యూటేషన్‌లు కేవలం పది కిలోమీటర్లు పరిధిలోఉండాలని నిబంధన ఉన్నప్పటికీ, 60 నుంచి వంద కిలోమీటర్లు దూరంలో చేయడం సమంజసం కాదన్నారు. డిప్యూటేషన్‌లను రద్దు చేయకపోతే డీడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా కోశాధికారి విశ్వరాజ్, కార్యదర్శులు ఆదిరెడ్డి, సూరిబాబు, మహేష్‌లు పాల్గొన్నారు.