
పొక్లెయిన్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం
పాడేరు : తన వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామం నుంచి పాడేరుకు ద్వీచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడు పొక్లెయిన్‌ను ఢీ కొట్టిన సంఘటనలో తీవ్ర గాయాలపాలయ్యాడు. హుకుంపేట మండలం దాలిగుమ్మడి గ్రామానికి చెందిన అర్లాబు ధామస్ ప్రవీణ్ అనే యువకుడు తన వ్యక్తిగత పనుల నిమిత్తం ద్వీచక్ర వాహనంపై సోమవారం సాయంత్రం పాడేరు వస్తుండగా పట్టణ శివారు చింతలవీధి హెచ్‌పీ పెట్రోల్ బంకు ఎదురుగా ప్రధాన రహదారిపై పొక్లెయిన్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు అతడిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.