
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
గంజాయితో పట్టుపడిన వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు
సీలేరు: సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేపడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా కోటనందూరు గోవిందరాజులు అనే వ్యక్తి 5 కిలోల గంజాయితో వెళ్తుండగా సోమవారం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుపడ్డాడని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని మరో ముద్దాయి పరారీలో ఉన్నట్లు తెలిపారు. బైకు స్వాధీనం చేసుకున్నామన్నారు.