
రక్తదానం చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు
కలెక్టర్ సంతకాలతో కూడిన ధ్రువపత్రాలను చూపిస్తున్న విద్యార్థులు, చిత్రంలో ప్రిన్సిపాల్ విజయభారతి, అధ్యాపకులు
చింతపల్లి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదానం చేసిన విద్యార్థులకు కలెక్టర్ దినేష్‌కుమార్ సంతకంతో కూడిన ధ్రువపత్రాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయభారతి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత మార్చి నెలలో రెడ్ క్రాస్ సొసైటీ, అధ్యాపకుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు.ఈ శిబిరంలో స్థానిక కళాశాల నుంచి 54 మంది విద్యార్థులు పాల్గొని రక్తాన్ని దానం చేశారన్నారు. విద్యార్థులను ప్రోత్సహించే విధంగా కలెక్టర్‌తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికారి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నోడల్ అధికారి సంతకాలతో కూడిన సర్టిఫికెట్లును మంజూరు చేసినట్టు తెలిపారు. రక్తదానం యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస పాత్రుడు, అధ్యాపకులు డాక్టర్ కెజియా రాణి, లీలాపావని, జగదీష్, రవీంద్ర నాయక్, ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు తదితరులు పాల్గొన్నారు.