
వైభవంగా శ్రీకృష్ణ జయంతి
సింహాచలం: సింహగిరిపై సోమవారం శ్రీకృష్ణాష్టమి ఘనంగా నిర్వహించారు. రాత్రి ఆరాధన అనంతరం ఈ ఉత్సవాన్ని విశేషంగా జరిపారు. ఆండాళ్లమ్మ ఉత్సవమూర్తిని దేవకీదేవిగా అలంకరించి పల్లకిలో వేంజేపచేసి బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. అనంతరం దేవకీదేవిని బేడామండపంలో వేంజేపచేసి శ్రీకృష్ణ జననోద్ధారణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. బేడా తిరువీధి అనంతరం ఆస్థానమండపంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి, ఆళ్వారుల చెంతన బాలకృష్ణున్ని ఉంచి పంచామృతాలతో అభిషేకం చేశారు. విశేష హారతులిచ్చారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, వేదపండితులు, పారాయణదారులు ఈ ఉత్సవాన్ని జరిపారు. శ్రీ కృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఆలయ రాజగోపురం వద్ద ఉట్ల సంబరాన్ని నిర్వహించనున్నారు.