
న్యాయం చేయాలని వినతి
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజను కలిసి వినతిపత్రం అందజేస్తున్న కమిటీ సభ్యులు
సీలేరు: ఏపీ జెన్ కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ సీలేరు(పార్వతీ నగర్ వద్ద) నూతన పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణం నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని పంప్డ్ స్టోరేజీ ప్రా జెక్టు నిర్వాసితుల కమిటీ సభ్యులు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజకు సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు.ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజను కలిసి సమస్య వివరించారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం వెనుకబడి ఉందని, తమకు పరిహారం తదితర విషయాల్లో న్యాయం చేయకుండా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పీవో స్పందిస్తూ తప్పనిసరిగా ఆయా గ్రామాల్లో పర్యటించి నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.నాయకులు రాజు, మనోజ్‌కుమార్, సిద్దార్ద్ మార్క్, అప్పారావు ఉన్నారు.