
త్రుటిలో తప్పిన ప్రమాదం
గంగవరం : మండలంలోని కుసుమరాయి జంక్షన్ జాతీయ రహదారి 516–ఇ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు– ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ముందు భాగం ముక్కలు కాగా, కారు ఎదురుభాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో దృశ్యాలు చూసి స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని పలువురు చెప్పారు. జాతీయ రహదారిపై ప్రయాణించాలంటే భయపడుతున్నారు. ఈ జాతీయ రహదారి మాత్రం ప్రమాదాలకు నిలయంగా మారిందని చర్చించుకుంటున్నారు.