
తుప్పలతో చెప్పలేనన్ని తిప్పలు
సాక్షి,పాడేరు: మైదాన ప్రాంతాలకు వెళ్లే పాడేరు ప్రధాన ఘాట్ రోడ్డులో ఇరువైపులా పెరిగిపోయిన తుప్పల వల్ల వాహన చోదకులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకర మలుపుల్లో తుప్పలు రోడ్డును ఆనుకుని ఉన్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినుములూరు నుంచి ఘాట్ చివరి వరకు సుమారు 18 కిలోమీటర్ల రోడ్డు పొడవునా ఈమధ్యకాలంలో జంగిల్ క్లియరెన్స్ పనులు జరగలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తుప్పలు భారీగా పెరిగిపోయాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులు, సందర్శనకు వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఆర్‌అండ్‌బీ అధికారులు జంగిల్ క్లియరెన్స్‌కు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

తుప్పలతో చెప్పలేనన్ని తిప్పలు

తుప్పలతో చెప్పలేనన్ని తిప్పలు