
గల్లంతైన మత్స్యకారుడికోసం ముమ్మర గాలింపు
ముంచంగిపుట్టు: మత్స్యగెడ్డలో ప్రమాదవశాత్తూ గల్లంతైన దొమినిపుట్టు గ్రామానికి చెందిన మత్స్యకారుడు కిలో నర్సింగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వీటిని ఆదివారం ఎస్‌ఐ జె.రామకృష్ణ, ఆర్‌ఐ రవికుమార్ పర్యవేక్షించారు. గల్లంతైన ప్రదేశం నుంచి దిగువ బలిమెల వరకు నాటు పడవలపై గాలించారు. అయినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చేసేందుకు అవస్థలు పడుతుండటంతో కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నర్సింగ్ భార్య, పిల్లలు రోదిస్తూ మత్స్యగెడ్డ ఒడ్డున నిరీక్షించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో నిరాశతో ఇంటికి వెళ్లిపోయారు.

గల్లంతైన మత్స్యకారుడికోసం ముమ్మర గాలింపు