
చిత్తడి దారితో సతమతం
చింతపల్లి: మండలంలో పెద్దగెడ్డ వంగసార వెళ్లె రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహనచోదకులు రాకపోకలు సాగించడానికి అనేక అవస్థలు పడుతున్నారు. పెదబరడ పంచాయతీ పరిధిలోని ఈ గ్రామానికి వెళ్లే మార్గమద్యలో కల్వర్టు వద్ద ఇరువైపులా రహదారి పూర్తిగా చిత్తడిగా మారింది.దీంతో ఈ రహదారి మీదుగా వాహన రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు.జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పెద్దగెడ్డ నుంచి అటు పాడేరు, ఇటు కృష్ణదేవిపేట వెళ్లేందుకు దగ్గర మార్గం కావడంతో చాలా మంది ఈ మార్గం మీదుగానే ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ పరిస్థితులో వంగసార వద్ద రోడ్డు మొత్తం పాడవడంతో ప్రయాణాలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. చినుకు పడితే దారి చిత్తడిగా మారుతుండడంతో వాహనచోదకులు జారిపడి గాయాలపాలవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వంగసార కల్వర్టు వద్ద సీసీ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.