ప్రమాదభరింతగా ప్రయాణం సాగిస్తున్న పట్నపడాల్‌పుట్టు గిరిజనులు
నాటు పడవలపై చేపలవేట చేస్తున్న గిరిజనులు
ముంచంగిపుట్టు: నిత్యం మత్స్యగెడ్డ దాటలేనిదే వారికి జీవనం సాగదు. నిత్యావసర సరుకులు, వ్యాపార లావాదేవీలు, చదువులు అన్నింటికి మత్స్యగెడ్డపై నాటు పడవలపై ప్రయాణాలు చేయాల్సిందే. ప్రయాణంలో నాటు పడవలు మునిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ముంచంగిపుట్టు మండలంలో పనసపుట్టు, సుజనకోట, పెదగూడ, దారెల, వనుగుమ్మ, జోలాపుట్టు, మాకవరం, రంగబయలు పంచాయతీల్లో సుమారు 86 గ్రామాల మీదుగా మత్స్యగెడ్డ విస్తరించి ఉంది. ఆయా గ్రామాల గిరిజనులు ప్రతి రోజు నాటు పడవలపై ప్రయాణించి మండల, పంచాయతీ కేంద్రాలకు పనుల నిమిత్తం వస్తుంటారు. దీంతో పాటు గిరిజన మత్స్యకారులు సైతం నాటు పడవలపైనే చేపల వేటను సాగిస్తున్నారు. వలలకు చిక్కిన చేపలను మండల కేంద్రం, వారపు సంతలకు తీసుకువచ్చి అమ్మకాలు చేసి జీవనం సాగిస్తున్నారు.
పెరుగుతున్న ప్రమాదాలు
మత్స్యగెడ్డలో ప్రయాణాలు, చేపల వేటలో సమయాల్లో నాటు పడవలు బోల్తా కొట్టి అనేకమంది ప్రాణాలను కోల్పోయిన సంఘటలున్నాయి. ప్రమాదాలు జరిగే సమయాల్లో అధికారులు తదితరులు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పించే హామీలు గుప్పించి, తరువాత విస్మరించడం పారిపాటిగా మారింది. దీంతో హామీలు నీటిపై రాతలుగానే మిగులుతున్నాయి.మండలంలో ఆరు పంచాయతీల్లో మత్స్యగెడ్డ పరివాహిక గ్రామాల్లో ప్రభుత్వం లెక్కల ప్రకారం నాటుపడవల ప్రమాదాల్లో 95 మంది మృతి చెందారు. ముఖ్యంగా సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామం వద్ద ప్రతి రోజు గిరిజనులు తాడు సహాయంతో బోటుపై గిరిజనులు ప్రమాదభరితంగా దాటుతున్నారు. కుమ్మరిపుట్టు వద్ద వంతెన నిర్మించాలని గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు పోరాటాలు చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోను మాత్రమే వంతెన నిర్మిస్తామని నేతలు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత పట్టించుకోవడం లేదు.గిరిజన మత్స్యకారులు సైతం రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేసి నాటు పడవలను స్వయంగా తయారు చేసుకుంటున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారలు స్పందించి మత్స్యగెడ్డ ప్రాంతాల గిరిజనులకు రాయితీపై బోట్లు, వలలు అందించాలని, కుమ్మరిపుట్టు మత్స్యగెడ్డ వంతెనను నిర్మించాలని కోరుతున్నారు.
మత్స్యగెడ్డలో పడవలపై
ప్రమాదకర ప్రయాణం
ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న
గిరిజనులు
చేపల వేటలోను ప్రమాదాలు
ఆందోళనలో గ్రామస్తులు
ఫైబర్ బోట్లు, వలలు అందించాలని స్థానికుల వినతులు
వంతెన నిర్మించాలి
మత్స్యగెడ్డ ప్రాంతాల్లో గిరిజను లు నాటు పడవలపై ప్రమాదాలు చేస్తూ తరుచూ ప్రమాదాలు బారిన పడుతున్నారు. చాలా మంది గిరిజనులు నాటు పడవ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల సమయాల్లో అధికారులు హామీ ఇస్తున్నారు.తరువాత మర్చిపోతున్నారు.ప్రమాదాల్లో మృతి చెందిన గిరిజనులను ప్రభుత్వం ఆందుకోవాలి. గిరిజన మత్స్యకారులకు బోట్లు, వలలు ఉచితంగా అందించాలి. కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై సైతం వంతెన నిర్మించాలి.
– వెంగడ రమేష్, సర్పంచ్, సుజనకోట పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం
ప్రతిపాదనలు పంపాం
మండలంలో ఆరు పంచాయతీల్లో మత్స్యగెడ్డ ప్రాంతాల గిరిజనులకు బోట్లు, వలలు రాయితీపై అందించాలని గిరిజనులు మా దృష్టికి తీసువచ్చారు. దీంతో పాటు కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరు చేస్తే వంతెన పనులు ప్రారంభిస్తాం. నాటు పడవలపై ప్రయాణాలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
– శంకర్‌రావు, తహసీల్దార్, ముంచంగిపుట్టు
ప్రయాణం భయం.. భయం
ప్రయాణం భయం.. భయం
ప్రయాణం భయం.. భయం
ప్రయాణం భయం.. భయం