
గిరిజనులకు సేవ చేస్తే గుర్తింపు
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజనులకు ఉత్తమ సేవలు అందించిన ఏ అధికారికై నా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ అన్నారు.బదిలీపై వెళుతున్న పీవో కట్టా సింహాచలం వీడ్కోలు సభను ఐటీడీఏ సమావేశపు హాలులో గురువారం నిర్వహించారు. ఈ సభలో కట్టా సింహాచలంను నూతన పీవో గజమాలతో సన్మానించి, మాట్లాడారు. అనంతరం బదిలీపై వెళుతున్న పీవో కట్టా సింహాచలం మాట్లాడుతూ ఐటీడీఏ పీవోగా పనిచేసిన 13 నెలల్లో టీం వర్క్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. గుర్తేడును మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. గుర్తేడులో పోలీస్ స్టేషన్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు తన హయాంలో జరిగినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయిప్రశాంత్, ఏపీవో డీఎన్‌వీ రమణ, ఎస్‌డీసీ పి.అంబేడ్కర్, సబ్ డీఎఫ్‌వో అనుష, డీడీ రుక్మాండయ్య, ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణరాజ్