
త్వరితగతిన వినతుల పరిష్కారం
7వ పేజీ తరువాయి
కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కిరసాని కిషోర్ మాట్లాడుతూ గతంలో పనిచేసిన పాడేరు ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమశాఖ అధికారి ప్రత్యేక చొరవతో 100 మంది గిరిజన విద్యార్థులకు సూపర్ 50 బ్యాచ్‌లో ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చారన్నారు. ఈ ఏడాది కూడా సూపర్ ఫిఫ్టీ బ్యాచ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు. ఇవి కొన్ని మండలాలకే పరిమితం కాకుండా జిల్లావ్యాప్తంగా ఐటీడీఏల పరిధిలో ఉన్న 22 మండలాల్లో విద్యార్థులో సూపర్ ఫిఫ్టీ బ్యాచ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో సూపర్ ఫిఫ్టీ బ్యాచ్‌లో ఉతీర్ణులైన విద్యార్థులు ఉన్నత చదువులకు అస్కారం ఏర్పడందన్నారు. ఎంబిబిఎస్,సివిల్స్, త్రిబుల్ ఐటి,వివిద ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆష్కారం ఆయిందన్నారు,