
1020 కిలోల గంజాయి పట్టివేత
● టిప్పర్‌లో తరలిస్తుండగా పట్టుకున్న
ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
● ముగ్గురు అరెస్టు,
మరో ఇద్దరి కోసం గాలింపు
పాడేరు: జిల్లాలోని పెదబయలు మండలం గోమంగి శివారు ప్రాంతంలో శుక్రవారం ఒడిశా నుంచి ఏజెన్సీ మీదుగా జార్ఖండ్‌లోని రాంచీకు తరలిస్తున్న 1020 కిలోల ఎండు గంజాయిని అనకాపల్లి ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మహేష్‌కుమార్ శుక్రవారం పాడేరులో వెల్లడించారు. పెదబయలు మండలం గోమంగి శివారు ప్రాంతంలో పెట్రోలింగ్‌లో భాగంగా వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశామన్నారు. వారిని విచారించగా ఓ టిప్పర్‌లో భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడించారన్నారు. దీంతో అటువైపుగా వస్తున్న టిప్పర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా భారీగా గంజాయి లభ్యమైందన్నారు. వాహనాన్ని పాడేరులోని ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి తరలించామన్నారు. ముప్పై గోనె సంచుల్లో నింపిన 1020 కిలోల ఎండు గంజాయిని సీజ్ చేశామన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం చందక గ్రామానికి చెందిన గెను సేతి, ముంచంగిపుట్టు మండలం లబ్బురు పంచాయతీ జప్పర్ గ్రామానికి చెందిన సీసా ముస్తాబ్, పెదబయలు ప్రాంతానికి చెందిన నీలయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. పెదబయలుకు చెందిన డ్రైవర్ వి. మోహన్, టిప్పర్ యజమాని వి.కిశోర్‌కుమార్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వీరిని అరెస్ట్ చేస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.25 లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో పాడేరు ప్రొహిబిషన్ ఆండ్ ఎకై ్సజ్ సీఐ కె.రాజారావు, ప్రొహిబిషన్ ఆండ్ ఎకై ్సజ్ ఎస్‌ఐ డి. గణేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ సూర్యప్రకాష్, శంకర్‌కుమార్, సిబ్బంది నాయుడు, రాజ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

1020 కిలోల గంజాయి పట్టివేత