
త్వరితగతిన వినతుల పరిష్కారం
మిగతా 8వ పేజీలో
● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
● పీజీఆర్‌ఎస్‌లో 134 అర్జీల స్వీకరణ
పాడేరు: సమస్యలపై అర్జీదారుల నుంచి స్వీకరించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరిగతిన పరిష్కరించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, డీఆర్వో పద్మలతతో కలిసి 134 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వినతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు చేశారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ అర్జీల నమోదు చేసుకునేందుకు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఆర్‌డీఏ పీడీ మురళి, డీఈవో బ్రహ్మజీరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, డీఎల్‌పీవో కుమార్, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా ఖజాన అధికారి ప్రసాద్‌బాబు, ఐటీడీఏ ఏవో హేమలత పాల్గొన్నారు.
సూపర్ ఫిఫ్టీ బ్యాచ్‌ల ఏర్పాటుకు వినతి
పాడేరు రూరల్: 2025 విద్యాసంవత్సరానికి సంబంధించి సూపర్ ఫిఫ్టీ 50 బ్యాచ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం (జీఎస్‌యూ) ప్రతినిధులు