
గర్భిణులు, శిశువుల ఆరోగ్యమే లక్ష్యం
● ఏడీఎంహెచ్‌వో ప్రతాప్
పాడేరు: గర్భిణులు, శిశువుల ఆరోగ్యం పెరుగుపరచడమే లక్ష్యంగా యూ–విన్ కార్యక్రమం ద్వారా ఆన్‌లైన్ టీకాల నవీకరణ జరుగుతోందని ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టి. ప్రతాప్ అన్నారు. ప్రపంచ టీకాల కార్యక్రమం(యూ–విన్) ఆన్‌లైన్ నవీకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఐటీడీఏలోని తన కార్యాలయంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నీలవేణి, జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ కమలకుమారి తదితరులతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యూ–విన్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమాజంలో ప్రతి కుటుంబానికి సరైన సమయంలో టీకాలు అందించేలా డిజిటల్ రూపంలో అందుబాటులో తెస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా యూ–విన్ కోఆర్డినేటర్ ప్రసన్నదత్త పాల్గొన్నారు.