
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఆందోళన
● లోయర్ సీలేరు జేఏసీ తీర్మానం
చీఫ్ ఇంజినీర్ చిన్నకామేశ్వరరావుకు
వినతిపత్రం ఇస్తున్న జేఏసీ నాయకులు
మోతుగూడెం: దీర్ఘకాలిక సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలని లోయర్ సీలేరు జేఏసీ తీర్మానించింది. ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి పిలుపు మేరకు గురువారం లోయర్ సీలేరు జెఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 15 నుంచి 22 వరకు జరిగే ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించారు. ఈ మేరకు వినతి పత్రాన్ని లోయర్ సీలేరు కాంప్లెక్స్ సీఈ డి.చిన్నకామేశ్వరరావుకు శుక్రవారం అందజేశారు. స్థానిక సమస్యలపై జేఏసీ ప్రతినిధులు ఆయనతో చర్చించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డీఈ బాలకృష్ణ, నాగశ్రీనువాస్, జేఏసీ చైర్మన్ కన్వీనర్ వేమగిరి కిరణ్, ఆనందబాబు, రామారావు రమణ, తదితరులు పాల్గొన్నారు.