
పీసా చట్టం పటిష్టంగా అమలు
● కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ రామిత్ మౌర్య ఆదేశం
● డి.గొందూరులో గ్రామసభకు హాజరు
పాడేరు రూరల్: షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టాం పట్టిష్టంగా అమలు చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ రమిత్ మౌర్య ఆదేశించారు. గురువారం మండలంలోని డి.గొందూరు పంచాయతీ పీసా క్లస్టర్‌లో నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టాం అమలుపై ఆదివాసీ ప్రజలనుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతై 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టం పటిష్టంగా అమలు చేయాలన్నారు. గిరిజన ఉత్పత్తులు, అటవీ సంపద, గిరిజన ఆదివాసీల సంప్రదాయాలు పరిరక్షించాలని ఆయన సూచించారు. ఆదివాసీల ప్రత్యేక హక్కులు చట్టాలపై అందరికి అవగహన కలిగి ఉండాలన్నారు. అన్నివర్గాల ప్రజలు చైతన్యంతోనే ఆదివాసీలు మరింత ప్రగతి సాధ్యమవుతుందన్నారు. స్వయం పరిపాలనను బలోపేతం చేయడం, అధికార వికేంద్రీకరణ వనరుల నియంత్రణ, సంస్కృతి పరిరక్షణ, మత్తు పదార్థాల నియంత్రణ, భూములు అన్యాక్రాంతం కాకుండా నిరోధించడం పీసా చట్టం పరిధిలో వస్తాయన్నారు. ముందుగా పర్యటనకు వచ్చిన బృందాన్ని వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, పీసా కమిటీ సభ్యులు, స్థానిక ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్ కుమార్, డీపీవో చంద్రశేఖర్, ఎంపీడీవో తేజరతన్, సర్పంచ్‌లు రాంబాబు, రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.