
ఆగని పశువుల అక్రమ రవాణా
● యథేచ్ఛగా మైదాన ప్రాంతాలకుతరలింపు
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు.రాత్రి సమయంలో వ్యాన్లలో మైదాన ప్రాంతాలకు భారీగా పశువులను అక్రమంగా తరలిస్తున్నారు.పాడేరు ఘాట్ రోడ్డులోని వంతాడపల్లిలోని అటవీశాఖ,తాటిపర్తి మోదకొండమ్మతల్లి గుడి వద్ద పోలీసుశాఖ చెక్‌పోస్టులు 24గంటలూ పనిచేస్తున్నా పశువుల అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.గురువారం పాడేరు మండలం గుత్తులపుట్టులో వారపుసంతలో పశువుల వ్యాపారం భారీగా జరిగింది. మైదాన ప్రాంతాల్లోని కబేళా వ్యాపారులంతా ఈ సంతలో పశువులను కొనుగోలు చేసి చీకటి పడిన తరువాత వ్యాన్లలో పాడేరు ఘాట్‌రోడ్డు మీదుగా తరలించారు.ప్రతి రోజు ఏజెన్సీ రోడ్ల మీదుగా మైదాన ప్రాంతాల్లోని కబేళాలకు పశువులను అక్రమంగా వ్యాపారులు తరలిస్తున్నారు.పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.