
ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి
అచ్యుతాపురం రూరల్: మండలంలోని చీమలాపల్లిలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన రైతు నగిరెడ్డి సత్యారావు (48) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. సత్యారావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వాడు. అతడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తన కుమారుడిని మద్యానికి డబ్బులడగ్గా, నిరాకరించడంతో మనస్తాపానికి గురై గత శనివారం గడ్డి మందు తాగాడు. దాంతో కుటుంబ సభ్యులు విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం వేకువజామున మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ నమ్మి గణేష్ తెలిపారు.