
ఈపీడీసీఎల్ సీవోవోగా మరోసారి కింజరాపు
సాక్షి, విశాఖపట్నం : ఏపీఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ అధికారి(సీవీవో)గా రిటైర్డ్ ఎస్‌పీ కింజరాపు వెంకట రామకృష్ణప్రసాద్‌ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఆగస్ట్ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ సీవీవోగా విధులు నిర్వర్తించారు. మరోసారి కాంట్రాక్టు పద్ధతిలో మరో ఏడాదిపాటు నియమిస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీఈపీడీసీఎల్ సీఎండి ఇమ్మడి పృథ్వీతేజ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజిలెన్స్ విభాగంలో సీవీవోగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.