
రామరాజుపాలెంలోహైవే టోల్‌గేట్ ఏర్పాటు
కొయ్యూరు: మండలంలోని పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం వద్ద జాతీయ రహదారి 516ఈ టోల్ గేటు సిద్ధమైంది. సిబ్బంది ఉండేందుకు అవసరమైన భవనాలు నిర్మిస్తున్నారు. వంద కిలోమీటర్లకు ఒక టోల్ గేటు ఏర్పాటుచేస్తారు. ఈ మార్గం కొయ్యూరు నుంచి గూడెంకొత్తవీధి మండలం రంపుల, పెదవలస మీదుగా చింతపల్లి వెళ్తుంది. అక్కడ నుంచి లోతుగెడ్డ జంక్షన్ నుంచి లమ్మసింగి, తాజంగి మీదుగా జి.మాడుగుల, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వెళ్తుంది. రామరాజుపాలెం నుంచి విజయవాడ దాదాపుగా 257 కిలోమీటర్ల దూరం ఉన్నట్టుగా హైవే అధికారులు బోర్డులో పేర్కొన్నారు. చింతాలమ్మ ఘాట్ రోడ్డులో రహదారి పూర్తయింది. రంపుల రహదారిలో పూర్తి కావస్తుంది. లమ్మసింగి, జి.మాడుగుల రహదారిలో పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.