
ఆధ్యాత్మికతతో ప్రశాంత జీవనం
అడ్డతీగల: ఆలయాల్లో నిత్య ధూప ధీప నైవేద్యాలు జరగాలని షణ్ముక పీఠాధిపతి స్కంద స్వామీజీ అన్నారు. అడ్డతీగలలోని పవనగిరి క్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రంపచోడవరం డివిజన్‌లోని 70 గ్రామాలకు షణ్ముకపీఠం తరఫున ఆలయ అర్చకులకు పూజా ద్రవ్యాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన అర్చకులకు పూజాద్రవ్యాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా స్కంద స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఆధ్యాత్మిక జీవనాన్ని అలవర్చుకోవాలని కోరారు. పవనగిరి క్షేత్రం వ్యవస్థాపకులు తణుకు వెంకటరామయ్య సూచనల మేరకు పూజాద్రవ్యాలను అందజేశామన్నారు. తణుకు వెంకటరామయ్య, విజయలక్ష్మి దంపతులు, షణ్ముక పీఠం సభ్యులు పాల్గొన్నారు.