
రోడ్డు ప్రమాదంలోఇద్దరికి తీవ్ర గాయాలు
హుకుంపేట: మండలంలోని అరకు–పాడేరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పాలేం గ్రామాని చెందిన కుర్రా నర్సింగరావు, ఆయన భార్య పాడేరు నుంచి హుకుంపేట వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా తడిగిరి గ్రామానికి చెందిన పూజారి సుబ్బారావు,అరిసెల గిరిబాబు అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై అతివేగంతో వెనుకవైపు నుంచి దూసుకొచ్చి దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో నర్సింగరావు, ఆయన భార్యకు స్వల్పగాయాలు కాగా, సుబ్బారావు,గిరిబాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.